telugu navyamedia
వార్తలు సామాజిక

పాఠశాల అపహాస్యమైతే విద్య నిరర్థకము!

school teachers class

ఈ సమాజ పునాదులు పాఠశాలల భుజాలపై నిలబడి ఉన్నాయి. వాటిని ఆడియోల ద్వారా, వీడియోల ద్వారా, సినిమా లో జోకర్ ల లాగ చూయించి కొందరు అపహాస్యము చేస్తున్నారు. ఎక్కడైతే ఒక ఉపాధ్యాయుడు లేక ఒక పాఠశాల అవమనించబడి, అపహాస్యం కావింప బడుతాయో అక్కడ విద్య నిరర్థకము అవుతోంది.

విపత్కర సమయములో అవసరము అందరికీ అలాగే ఆశ కూడా అందరికీ ఉంటుంది. ఒక స్కూల్ వాళ్ళు తళ్లి దండ్రులకు ఫోన్ చేసి ఫీ అడుగుతే ఆ స్కూల్ మ్యానేజేమెంట్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీని పై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఒక చిన్న ఆశ తో, అది కూడా వినమ్రంగా ఫీ అడిగినంత మాత్రానా, మా స్కూల్ మేనేజ్మెంట్ లు రక్తం పీల్చే జలగలు అని అనుకోవడం, మమ్ములను ఇలా వీడియోలు ఆడియో ల ద్వారా అవమానించడంపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కోట్ల బడ్జెట్ ఉన్న ప్రభుత్వమే అందరికీ సగం జీతం చెల్లిస్తాం అని అన్నది, మరి ఎన్ని స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇలా సగం జీతం మాత్రమే ఇస్తాము లేదా తీసి వేస్తాం అని అనలేరు. స్కూల్ మేనేజ్మెంట్ మరియు మా స్టాఫ్ అందరము కూడా మనుషులమే కదా? మమ్మల్ని ఈ ఆడియో ద్వారా ఎగతాళి చేయ్యాలని ఎలా అనిపించిందని కొందరు వాపోతున్నారు.

ఎన్ని కిరాణా దుకాణాల లో ఎక్కు మొత్తం లో అమ్ముతున్నారు తెలుసా? వాళ్ళు మాత్రం కరెక్ట్!! కాని మీరు, ఈ టైం లో ఫీ కట్టరు అని తెలిసినా, ఎదో ఒక చిన్న ఆశతో అడగడం ఒక తప్పా? మాకు కూడా ఈ ఏం ఐ వాళ్ళు ఫోన్ చేసినారు, ఫైనాన్స్ వాళ్ళు ఫోన్ చేసినారు. అడిగి నారు. తర్వాత కడ్తం అన్నము. ఊర్కున్నరు. ఇది అలాగే అనుకోవచ్చు కదా? అని కొన్ని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Related posts