telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఏప్రిల్ 11న సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్

2019 with elections is major agenda

తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న ఏప్రిల్‌ 11ను సార్వత్రిక సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సాధారణ సెలవు అమలవుతుందని తెలిపింది. పోలింగ్‌ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణి కేంద్రాల ఏర్పాటుకు వినియోగించే ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలకు పోలింగ్‌కు ముందు రోజు ఏప్రిల్‌ 10తో పాటు పోలింగ్‌ రోజు ఏప్రిల్‌ 11న స్థానిక సెలవు దినంగా ప్రకటించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది.

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న మే 23న అవసరమైతే స్థానిక సెలవును ప్రకటించాలని కలెక్టర్లను కోరింది. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ రోజు పరిశ్రమలు, కర్మాగారాలు, దుకాణాల్లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవును ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండి ఎన్నికలు జరగని బయటి ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులకు సైతం వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని పేర్కొంది.

Related posts