telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జీతగాళ్లమా? భిక్షగాళ్లమా?..

గవర్నమెంటు ఉద్యోగులుగా పనిచేస్తూ ఒకటో తేదీ జీతంతీసుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కుమిలిపోతున్నారు.

న్యాయం సమ్మతమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. మొక్కుబడి చర్చలు బెడిసి కొట్టాయి.

సర్కారుతో అమీతుమీకికి సిద్ధమయ్యారు. అమరావతిలో నిర్వహించిన ఉద్యోగులు సంఘం సమావేశంలో సంఘప్రతినిధి బండి శ్రీనివాసులు సంచలనం వ్యాఖ్యలు చేశారు.

ఉద్యమం ద్వారానే హక్కులను సాధించుకుంటాం ….. దయా దాక్షిణ్యాలు అవసరం లేదన్నారు.రైతుల ఉద్యమంతో సాక్షాత్తు ప్రధాన మంత్రి సైతం దిగొచ్చిన, తప్పైపోయిందని క్షమాపణలు కోరారు.

భావితరాల కోసం ఉద్యమం ఎలా ఉండాలి అనేది చెప్పేందుకే తప్ప, మోచేతినీళ్లు తాగే పరిస్థితి రాదన్నారు.  ఉద్యోగులు చచ్చిపోతున్నా కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. ఒకటో తేది జీతాలు రాకపోగా పాలవాళ్లు దగ్గర, కూరగాయల వాళ్లు దగ్గర ప్రభుత్వ ఉద్యోగులు లోకువైపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగుల అంతర్గత సమావేశంలో ప్రభుత్వ తీరుపై బండి శ్రీనివాసులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

నేను విన్నాను …. నేను ఉన్నాను …. చెప్పిన మాయ మాటలు విని 151 సీట్లు తీసుకొని వచ్చాము. ఆరేపోయే ముందు దీపం బాగా వెలిగిద్ది ….. అటువంటిదే ఈ పిచ్చి పిచ్చి మున్సిపాలిటీలు , జిల్లా పరిషత్‌ ఫలితాలనే అభిప్రాయం వ్యక్తంచేశారు.

ఉద్యోగుల పరిస్థితి ఎంటో చంద్రాబాబుకు బాగా తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగికి 5 ఓట్లు ఉంటాయి.

ఆ లెక్కన సుమారు 65 లక్షల మంది ప్రభుత్వాన్ని కూల్చవచ్చు …. నిలబెట్టవచ్చు … అనే లెక్కలతో ఫలితాలను విశ్లేషించారు. ఉద్యోగుల శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే నన్నారు.

Related posts