telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రధాన మంత్రి పిలుపునుగౌరవించి… భారతీయులంతా దివ్వెలను వెలిగించాలి

Chiranjeevi

భారతీయులంతా కలిసి ఏప్రిల్‌ 5న కరోనా వైరస్‌ను తరిమికొట్టాలని దీని కోసం ఈ ఆదివారం ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆపేసి కొవ్వొత్తులు, దివ్వెలను వెలిగించాలని దేశ ప్రజలను ప్రధాని కోరుతూ ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎవరి ఇంటి గుమ్మం వద్ద వారే జరుపుకోవాలని ఎవరూ రోడ్లపైకి రావొద్దని మోదీ సూచించారు. మోదీ పిలుపునిచ్చిన కార్యక్రమానికి అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది. జనతా కర్ఫ్యూ మాదిరిగానే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని పలువురు ప్రముఖులు ప్రజలను కోరుతున్నారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ప్రధాన మంత్రి పిలుపును ప్రతి ఒక్కరూ గౌరవించాలని చిరంజీవి తెలుగు రాష్ట్రాల ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. ‘‘మన ప్రియమత ప్రధాన మంత్రి పిలుపును గౌరవిస్తూ ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు మనమంతా దివ్వెలను వెలిగించి కరోనా వల్ల ఏర్పడిన చీకటిని తరిమికొడదాం. మన దేశం ఒక్కటవుదాం, మనం ఒకరికోసం ఒకరం నిలబడతామని పునరుద్ఘాటిద్దాం’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. చిరంజీవి ట్వీట్‌కు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. కచ్చితంగా ఈ సూచనలను పాటిస్తామని కామెంట్లు చేస్తున్నారు.

Related posts