telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అమెజాన్ అడవులకు నిప్పు పెట్టించింది “టైటానిక్” హీరోనే… బ్రెజిల్ అధ్యక్షుడు షాకింగ్ కామెంట్స్

hollywood hero leonardo donation for amazon forest

ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత లియోనార్డో డికాప్రియోపై షాకింగ్ కామెంట్స్ చేశారు బ్రెజిల్ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో. అ ‘డికాప్రియో తెలివైనవాడు కదా.. అమెజాన్‌ అడవుల్లో నిప్పు పెట్టించడానికి డబ్బులిచ్చాడు. డికాప్రియో.. అమెజాన్ అడవుల్లో నిప్పు పెట్టించడానికి కొన్ని సంస్థలతో చేతులు కలిపావు కదా..’ అని మీడియా ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బ్రెజిల్ అధ్యక్షుడు. నాన్ ప్రాఫిట్ సంస్థలకు 50వేల డాలర్ల ఫండ్స్ ఇచ్చి అమెజాన్ అడవులకు నిప్పు పెట్టించాడని ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత అమెజాన్ అడవులు కాపాడుకోవడానికి ప్రజల నుంచి ఫండ్స్ సేకరించాలని డికాప్రియో ప్లాన్ వేశారని అన్నారు. ఆయన ఆరోపణలను అగ్రరాజ్యంలో వివాదాస్పదం అయ్యాయి. అయితే డికాప్రియోనే మంటలు పెట్టించాడు అనడానికి తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. బ్రెజిల్‌కి వ్యతిరేకంగా ఉన్న ఓ అంతర్జాతీయ క్యాంపెయిన్‌కు డికాప్రియో మద్దతు తెలుపుతున్నారు. అందుకే ఆయనపై కోపంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు బ్రెజిల్ అధ్యక్షుడు.

అయితే తనపై వస్తున్న ఆరోపణలను కొట్టివేశారు డికాప్రియో. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. “అమెజాన్ అడవులు దగ్ధమైపోతున్న తరుణంలో తమ సహజ సంపదలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న బ్రెజిల్ వాసులకు నేను సపోర్ట్ చేస్తున్నాను. వాతావరణాన్ని కాపాడుకోవడానికి బ్రెజిల్ ప్రజలు చేస్తున్న కృషి అభినందనీయం. భర్తీ చేయలేని సహజ సంపదలను కాపాడుకోవడానికి యత్ని్స్తున్న సంస్థల తరఫున నేను నిలబడతాను. అయితే అమెజాన్ అడవుల్లో నిప్పు పెట్టించడానికి నేను ఏ సంస్థకూ డబ్బు ఇవ్వలేదు. అమెజాన్ అడవులను కాపాడుకోవడానికి కృషిచేస్తున్న బ్రెజిల్ కమ్యూనిటీస్, స్థానిక ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, ప్రజలకు నేను ఎల్లప్పుడూ మద్దతు తెలుపుతాను” అని పేర్కొన్నారు.

Related posts