telugu navyamedia
ఆంధ్ర వార్తలు

బీజేపీ బలోపేతాని వ్యూహరచన..

ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతాపార్టీ బలోపేతానికి ఢిల్లీలో ముఖ్యనేతలు వ్యూహరచన చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు జూమ్ యాప్ ద్వారా ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి మంచి పునాధులు వేయాలని భావిస్తున్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేయాలని నిర్ణయించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుసరించాల్సిన విధివిధానాలపై సుధీర్ఘంగా చర్చించి సముచిత నిర్ణయం తీసుకున్నారు.

బీజేపీ పటిష్టతకు యువతను పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయించారు. కార్యక్రమాల రూపకల్పనకు పార్టీ పెద్దలు మార్గదర్శనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశిక్షణ కార్యక్రమాలు ప్రారంభించాలని ప్రతిగ్రామాన బాధ్యతగల కార్యకర్తలను సిద్ధంచేయాలని నిర్ణయించారు. రాజధాని రైతుల పాదయాత్రకు బిజెపి మద్దతు పలకడం, అమరావతినే రాజధానిగా కొనసాగించాలనిగట్టిగా నిర్ణయంతీసుకోవడం మెజారిటీ ప్రజల్లో సానుకూలధోరణి పెంపొందించే ప్రయత్నంచేశారు.

ఆంధ్రప్రదేశ్ లో సహకార పంచదార మిల్లులను మూసివేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించడం కలిసొస్తుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను నిరసిస్తూ ధర్నా లు చేపట్టడం, ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు బిజెపి అండగా ఉంటుందనే భరోసా ఇవ్వాలని నిర్ణయించారు.

Related posts