telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కోలుకుంటున్న ఎస్పీ బాలు

SPB

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హాస్పిటల్‌లో జాయిన్ అయినప్పటి నుంచి ప్రతి రోజూ ఆరోగ్య పరిస్థితిని చెబుతూ ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వీడియోను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన విడుదల చేసిన వీడియోలో తన తండ్రి కోలుకుంటున్నారని, డాక్టర్స్‌కు, వైద్యానికి స్పందిస్తున్నారని తెలిపారు. “ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్య పరిస్థితి నార్మల్‌గా ఉంది. 90 శాతం ఐసోలేషన్‌ నుంచి బయటికి వచ్చేశారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు. డాక్టర్స్‌కు అలాగే వైద్యానికి స్పందిస్తున్నారు. నాన్నగారి కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఎంజీఎం హెల్త్ సెంటర్ వారికి కూడా ధన్యవాదాలు. అలాగే నాన్నగారి కోసం ఎంతో శ్రమించిన, శ్రమిస్తున్న డాక్టర్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు” అని చరణ్ ఈ వీడియోలో తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని సంగీత ప్రపంచం చేసిన పూజలు ఫలించాయి.

Related posts