సాంకేతిక సమస్యతో ఆలస్యమైన ఎయిరిండియా విమానాలు..

33

సాంకేతిక సమస్యలతో సర్వర్లు పనిచేయకపోవడం వల్ల రాజధాని దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు మధ్యాహ్నం ఎయిరిండియా విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీనితో విమానాశ్రయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అట్లాంటాలోని సిటా డేటాసెంటర్‌లో ఏర్పడిన నెట్‌వర్క్‌ కనిక్టివిటీ సమస్య వల్ల ఈ సమస్య వచ్చిందని, ఈరోజు మధ్యాహ్నం 12.10 నుంచి 15.10 గంటల వరకు మొత్తం 25 విమానాలు ఆలస్యమయ్యాయని ఎయిరిండియా వివరణ ఇచ్చింది.

సాంకేతిక సమస్యతో సర్వర్లు పనిచేయకపోవడం వల్ల విమానాలు ఆలస్యమైనట్టు తెలుస్తోంది. విమానాలు ఆలస్యమవడంపై పలువురు ప్రయాణికులు ట్విటర్‌లో పోస్ట్‌లు చేశారు. ‘గత రెండు గంటలుగా ఎయిరిండియా సర్వర్లు పనిచేయడం లేదు.. అంతర్జాతీయ, దేశీయ విమానాలన్నీ ఆగిపోయాయి. విమానాశ్రయమంతా ఇక్కడ నిలిచిపోయిన ప్రయాణికులతో మేళాను తలపిస్తోంది. కనీసం నడవడానికి కూడా స్థలం లేదంటూ’ ఓ ప్రయాణికుడు ట్వీట్‌ చేశారు.