telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బిగ్ బాస్”పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Lakshmi-Menon

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కు అన్ని భాషల్లో మంచి ప్రజాదరణ ఉంది. తెలుగులో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్-4 మంచి రేటింగ్స్ తో దూసుకెళ్తోంది. మరోవైపు బిగ్ బాస్ విమర్శలు కూడా భారీగా వస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ పైన ఓ హీరోయిన్ సంచలన కామెంట్లు చేసింది. లోక నాయకుడు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న తమిళ్ బిగ్ బాస్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. త్వరలో అక్కడ బిగ్ బాస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ లక్ష్మీమీనన్‌ తమిళ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గా వెళ్లబోతుందని వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై స్పందించిన లక్ష్మీ మీనన్ “నేను బిగ్‌బాస్‌ షోలో పార్టిసిపేట్‌ చేయడం లేదు. నేను ఇతరులు తిన్న ప్లేట్స్‌ను కడగడం, టాయ్‌లెట్స్‌ను శుభ్రం చేసే పనులను ఇప్పటి వరకు చేయలేదు, చేయను కూడా. కెమెరాముందు షో కోసం ఫైటింగ్ చేయడం నాకు నచ్చదు. నేను బిగ్ బాస్ కు వెళ్తున్నా అంటూ వస్తున్న వార్తలు రూమర్స్ మాత్రమే” అంటూ సమాధానం ఇచ్చింది.

Related posts