telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో రావాలి…టీడీపీని స్వాధీనం చేసుకోవాలి

జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అనంతరం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.  అమిత్ షా స్వయంగా వచ్చి.. జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం.. డిన్నర్ చేయడం రాజకీయంగా ఆసక్తి పెంచింది. 20 నిమిషాల పాటు ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్నారు.

అయితే వారిద్దరూ ఏం మాట్లాడరు..? వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నారా..? రాజకీయ అంశాలపై చర్చించారా అన్నది వారిద్దరికి తప్ప ఎవరికి తెలియదు.. కానీ ఎవరికి వారు.. వీరిద్ధరి బేటీపై బీజేపీ, వైసీపీ, టీడీపీ పలు అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నాయి

ఈ సమావేశంపై ఏపీ తెలుగు, సంస్కృతి అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ  లక్ష్మీపార్వతి ఆకాంక్షించారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకునేవారితో తానుకూడా ఉన్నానని తెలిపారు.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడంతోపాటు తెలుగుదేశం పార్టీని స్వాధీనం చేసుకోవాలంటూ లక్ష్మీ పార్వతి సూచించారు. అదే తన కోరిక అంటూ లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా వ్యవహరించి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారంటూ ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే.. పార్టీని సమసర్థవంతంగా నడిపించగలరంటూ అభిప్రాయపడ్డారు.

 

Related posts