ktr respons on utham tweet

ఉత్తమ్ ట్వీట్ పై స్పందించిన కేటీఆర్

16

తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి ట్వీట్ పై పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. కొమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలంలోని కర్జెల్లి ఎస్టీ కాలనీలో వృద్ధ దంపతులు నివాసముంటున్న గుడిసెకు స్థానిక పంచాయితీ అధికారులు రూ.500 ఇంటి పన్నును విధించారని ఉత్తమ్‌ సీఎంవో మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు.

అధికారులు ఇచ్చిన రశీదు, వృద్ధులు గుడిసె ముందు ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశారు. వృద్ధుల నుంచి వసూలు చేసిన పన్నును తిరిగి చెల్లించాలని, డబుల్‌బెడ్‌రూం ఇంటిని నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వృద్ధ దంపతులకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు, ఆసరా పెన్షన్‌ మంజూరు చేయించాలని అధికారులకు సూచించారు. ఉత్తమ్‌ ట్వీట్‌పై సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్‌ స్థానిక పంచాయతీ కార్యదర్శి చేసిన పొరపాటును సరిదిద్దాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.