telugu navyamedia
తెలంగాణ వార్తలు

కేసీఆర్​ రాజకీయాలను వీడి ఉంటే తెలంగాణ వచ్చేదా..

హైదరాబాద్​ కండ్లకోయలో ఐటీ పార్కుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. ఐటీ పార్క్‌తో కండ్లకోయ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​​ ఆశాభావం వ్యక్తం చేశారు

తెలంగాణ గేట్‌వే పేరిట మేడ్చల్‌ జిల్లా కండ్లకోయ ఓఆర్‌ఆర్‌ భారీ ఐటీ పార్క్​ను నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.వంద కోట్ల ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. పది ఎకరాల్లో 40 మీటర్ల ఎత్తు, 14 అంతస్తులతో ఐటీ పార్కును నిర్మిస్తున్నారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఫ‌లితంగానే నేడు కండ్లకోయ‌లో ఐటీ పార్కును నిర్మించుకుంటున్నామ‌ని స్పష్టం చేశారు. ఈ ఐటీ పార్కు ఆరంభం ఒక ప్రారంభం మాత్రమే అని మంత్రి చెప్పారు.

Image

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..చివరి వరకు పట్టుదలతో పోరాడితేనే విజయం లభిస్తుందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా తొలి ఎన్నికలో ఓడిపోయారని కేటీఆర్‌ చెప్పారు. తొలి ఓటమితో నిరుత్సాహపడకుండా రాజకీయాల్లో కొనసాగారన్నారు.

ఒకవేళ కేసీఆర్‌ రాజకీయాలను వీడి ఉంటే ఇవాళ తెలంగాణ సాధించి ఉండేవాళ్లమా? ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా కేసీఆర్‌ పోరాటాన్ని వీడలేదు. కేసీఆర్ స్ఫూర్తిగా అందరూ పట్టువదలకుండా పోరాడాలి. రాజకీయాల్లో కొనసాగి పట్టువిడవని పోరాటంతో తెలంగాణను సాధించారని పేర్కొన్నారు.

నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కుతాయన్న కేటీఆర్​.. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకుని ఉద్యోగాలు దక్కించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. కేసీఆర్ స్ఫూర్తిగా అందరూ పట్టువదలకుండా పోరాడాలని విద్యార్థులకు కేటీఆర్​ సూచించారు.

Related posts