BREAKING NEWS:
ktr-launched-free-diagnostic center

పేద ప్రజలకు అందుబాటులో డయాగ్నోస్టిక్ సెంటర్లు…

144

తెలంగాణ ఆరోగ్య శాఖలో మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు, తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ సెంట్రల్ హబ్ ను నారాయణగూడ లో ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని పురపాలక శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 120 కేంద్రాల్లో డయాగ్నోస్టిక్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. సేకరించిన శాంపిల్స్ ను పరీక్షలకోసం నారాయణగూడకు బ్రాంచ్ కు పంపించి రిపోర్టులను 24 గంటల లోపే ప్రజలకు అందిస్తారని మొత్తం 8 మినీ హబ్ లతో పాటు 120 కేంద్రాల ద్వారా పేద ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ఈ సేవలను తీసుకువచ్చినట్లు తెలిపారు మంత్రి కేటీఆర్.

ktr-launched-free-diagnostic center

భారత దేశంలో దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వ రంగ వైద్య వ్యవస్థ పై మార్పుకోసం భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లను మరియు చిన్నపిల్లలకు ఎన్ఐసీయూ ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కిడ్నీ బాధితులకు 40 డయాలసిస్ సెంటర్లను ప్రారంభించామని గుర్తుచేశారు.

ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్లలో 24 గంటల సేవా కార్యక్రమాలు జరుగుతాయని మొత్తం 53 పరీక్షలు పేదలకు ఉచితంగా అందిస్తామని తెలిపారు. వైద్య ఆరోగ్యమంత్రి లక్ష్మారెడ్డి మరియు పలువురు వైద్య అధికారులు సమావేశానికి హాజరయ్యారు.