telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ ఐటీ రంగం అద్భుతమైన ప్రగతి: కేటీఆర్

KTR TRS Telangana

తెలంగాణ ఐటీ రంగం అద్భుతమైన ప్రగతి సాధిచిందని ఆ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీ శాఖ ప్రగతి నివేదికను ఆయన విడుదల చేశారు. ఐటీ రంగంలో జాతీయ సగటు కంటే తెలంగా సగటు ఎక్కువ అని తెలిపారు. ఐటీ ఎగుమతుల జాతీయ అభివృద్ధి 8.09 శాతం అయితే, రాష్ట్రంలో అది 17.97 శాతంగా ఉందని వివరించారు. దేశ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 10.61 నుంచి 11.58 శాతానికి పెరిగిందని కేటీఆర్ వెల్లడించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ ప్రాంగణం హైదరాబాదులోనే ఏర్పాటైందని అన్నారు. రాష్ట్రంలో మైక్రాన్ సంస్థ అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం స్థాపించారని తెలిపారు. తెలంగాణలోని ద్వితీయశ్రేణి నగరాలకు కూడా ఐటీ రంగం విస్తరిస్తోందని తెలిపారు. దాదాపు 250కి పైగా కంపెనీలతో 1.16 లక్షల మందికి నేరుగా ఉపాధి లభిస్తోందని పేర్కొన్నారు.

Related posts