telugu navyamedia
సినిమా వార్తలు

డ్యూటీ ఎగ్గొట్టి “అవెంజర్స్”సినిమాకు జవాను… బయటకు రాగానే…

Avengers-4

“అవెంజర్స్ : ఎండ్ గేమ్” సినిమా ప్రపంచ రికార్డులను తిరగరాస్తోంది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా రక్షణ విభాగంలో ఉన్న ఓ జవాను ఉన్నతాధికారుల కన్నుగప్పి చేసిన పనికి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఈ ఘటన దక్షిణ కొరియాలో చోటుచేసుకుంది. ఒక సైనికుడు డ్యూటీ విడిచిపెట్టి “అవెంజర్స్: ఎండ్‌గేమ్” సినిమాకు వెళ్లాడు. ఉన్నతాధికారులకు ఆ జవాను డ్యూటీలో కనిపించకపోవడంతో అతని గురించి వెతకడం మొదలుపెట్టారు. దీంతో వారికి ఆ జవాను సినిమా చూసేందుకు వెళ్లినట్లు తెలియడంతో సదరు అధికారులు ఆ సినిమా థియేటర్ వద్దకు చేరుకుని, అతను బయటకు రాగానే అరెస్టు చేశారు. ఆ సైనికుని పేరు బయటకు వెల్లడించనప్పటికీ అతను “రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఎయిర్‌ఫోర్స్”లో పనిచేస్తున్నాడని తెలిసింది.

Related posts