telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా..

*ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా
*స్పీక‌ర్‌కు రాజీనామా లేఖ ఇచ్చిన రాజ‌గోపాల్ రెడ్డి
*స్పీక‌ర్ ఫార్మాట్‌లో రాజీనామాను స‌మ‌ర్పించిన‌

*రాజీనామా లేఖ ఇచ్చిన వెంట‌నే ఆమోదం
*గ‌వ‌ర్న‌ర్ అపాయింట్ మెంట్ కోరిన రాజ‌గోపాల్ రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సోమవారం ఉదయం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు.

ఇటీవల ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ మాజీ నేత రాజీనామా చేసినట్లు ప్రకటించారు. నేటి ఉదయం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి, స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను సమర్పించారు. ఆ  రాజీనామా లేఖ ఇచ్చిన వెంట‌నే స్పీక‌ర్ ఆమోదించారు . దీంతో మునుగోడుకు ఉప ఎన్నిక ఖారారైంది.

Related posts