telugu navyamedia
తెలంగాణ వార్తలు

తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర ..పార్టీ మారడం చారిత్రక అవసరం : రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హస్తం పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. రాజగోపాల్‌ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ​ నుంచి తాను బీజేపీలోకి చేరుతున్నానని అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను పార్టీ మారుతున్నట్టు దుష్ప్రచారం జరుగుతోంది.

కేసీఆర్ కుటుంబ అవినీతి, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కేసీఆర్‌ ఆడుతున్న నాటకం. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే ప్రసక్తే లేదు.

తాను ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను మర్యాదపూర్వకంగానేకలిశానని,అయితే బీజేపీలో చేరిక గురించి, తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయమై ,చర్చించలేదని స్పష్టం చేశారు.

నేను అమిత్‌ షాను కలిసినప్పటి నుంచి సీఎం కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదు. నేను రాజీనామా చేస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ అనుకూల పేపర్లలో రాయిస్తున్నారు. టీఆర్ఎస్ ఉసిగొల్పితే ఎన్నికలకు వెళ్లబోనని కూడా ఆయన స్పష్టం చేశారు.

రాజీనామా చేస్తున్నానని, ఉప ఎన్నిక వస్తుందని టీఆర్ఎస్ కు చెందిన మీడియాలో ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ..

ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే.. ప్ర‌జ‌ల‌కు , సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీకి చెప్పే పార్టీ మారుతాను. నా రాజీనామాతో మునుగోడు అభివృద్ధి చెందుతుంది అనుకుంటే నేను రాజీనామా చేసేందుకు సిద్ధమే అని స్పష్టం చేశారు.

తనను గెలిపించిన ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోనని ఆయన తెలిపారు. ఏం చేసినా కూడా తాను తన నియోజకవర్గ ప్రజలకు చెప్పే నిర్ణయం తీసుకొంటానన్నారు. తనకు అన్ని పార్టీల్లో అన్ని పార్టీలకు చెందిన ఎంపీలుంటారన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకొన్న నిర్ణయాల వల్ల పార్టీ బలహీనపడిందని అన్నారు.కాంగ్రెస్ పార్టీకి తాను వ్యతిరేకం కాదన్నారు.సోనియాకు, రాహుల్ కు వ్యతిరేకంగా తాను మాట్లాడబోనని వెల్ల‌డించారు.

Related posts