telugu navyamedia
క్రీడలు వార్తలు

వార్నర్‌ కూతురికి కోహ్లీ గిఫ్ట్…

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూతురు ఇండిరే కూడా కోహ్లీకి పెద్ద ఫ్యాన్. గత ఏడాది కోహ్లీ అంటే తన కూతురుకి ఎంతో ఇష్టమని చెప్పిన వార్నర్.. తాజాగా విరాట్ నుంచి టెస్టు జెర్సీని తీసుకెళ్లి ఆమెకి బహూకరించాడు. కోహ్లీ సంతకం చేసిన ఆ జెర్సీని సంతోషపడింది. దీనికి సంబందించిన ఫొటోని సోషల్ మీడియాలో వార్నర్ అభిమానులతో పంచుకున్నాడు.తాజాగా డేవిడ్‌ వార్నర్‌ ముద్దుల కూతురు ఇండిరే.. విరాట్‌ కోహ్లీ జెర్సీని ధరించి ఫోటోకు ఫోజిచ్చింది. ఈ సందర్భంగా వార్నర్..‌ కోహ్లీకి థ్యాంక్స్‌ చెప్పాడు. ‘మేం సిరీస్‌ ఓడిపోయామని మాకు తెలుసు.. కానీ ఒక్కసారి ఇక్కడ నవ్వుతున్న చిట్టితల్లిని చూస్తే ఆ బాధనంతా మరిచిపోతాం. విరాట్‌ నీ జెర్సీ నా కూతురుకి పంపినందుకు చాలా థ్యాంక్స్‌. నీ జెర్సీ ధరించి నా చిట్టితల్లి మురిసిపోతుంది’ అంటూ క్యాప్షన్‌ జతచేశాడు. ఇదివరకు కూడా ఇండిరే కోహ్లీలా బ్యాటింగ్ చేసింది. ఖాళీ సమయాల్లో కూడా కోహ్లీని అనుకరిస్తుంటుంది.

ఆసీస్‌ పర్యటనలో బోర్డర్-గవాస్కర్‌ ట్రోఫీని టీమిండియా 2-1 తేడాతో వరుసగా రెండోసారి గెలచుకొని చరిత్ర సృష్టించింది. చివరి టెస్టు జరిగిన గబ్బా మైదానంలో ఆసీస్‌ విధించిన 324 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి ఆసీస్‌ 32 ఏళ్ల జైత్రయాత్రకు చెక్‌ పెట్టింది. ఈ సిరీస్‌లో తొలి టెస్టు తర్వాత పెటర్నటీ లీవ్‌పై విరాట్ కోహ్లీ స్వదేశానికి వచ్చేయగా.. చివరి రెండు టెస్టుల్లో మాత్రమే డేవిడ్ వార్నర్ ఆడాడు. కాగా ఆసీస్‌ పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న టీమిండియా ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఆడనుంది. మరోవైపు ఆస్ట్రేలియా సిరీస్‌ ఆడేందుకు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌కి ఆడుతున్న డేవిడ్ వార్నర్‌కి భారత్‌లోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో తెలుగు సినిమా సూపర్ హిట్ పాటలకి డ్యాన్స్ చేసిన వార్నర్.. టిక్‌టాక్‌ సెలబ్రిటీగా మారిపోయాడు. అల్లు అర్జున్, మహేష్ బాబుల పాపులర్ పాటలకు కాలుకదిపాడు. అతనితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొన్ని పాటల్లో డాన్స్ విశేషం. వార్నర్ సతీమణి కాండీస్ కూడా బుట్టబొమ్మ పాటకు అద్భుతంగా డాన్స్ చేశారు. కూతుళ్లు ఇండిరే,ఇవిమే కూడా కొన్ని పాటలకు కాలుకదిపారు. దీంతో వార్నర్ ఫామిలీ టిక్‌టాక్‌ సెలబ్రిటీగా మారిపోయింది.

Related posts