telugu navyamedia
Uncategorized

వైద్యుల నివేదిక తర్వాత కోడెల మృతిపై ప్రకటన!

kodela shivaprasad

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయన ఇంటి వద్ద క్లూజ్‌టీం తనిఖీలు చేసింది. ఆధారాలు సేకరించే పనిలో పడింది. కోడెలది ఆత్మహత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు చెప్పారు. కోడెల మృతిపై ప్రాథమికంగా ఎలాంటి అనుమానాలు లేవని, ఘటన సమయంలో ఇంట్లో కోడెల భార్య, కూతురు, పనిమనిషి ఉన్నారని తెలిపారు.

కోడెల కొంతకాలంగా మనస్తాపంతో ఉన్నారని చెబుతున్నారని, వైద్యుల నివేదిక తర్వాత కోడెల మృతిపై ప్రకటన చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం నరసరావుపేటలోని టీడీపీ పార్టీ ఆఫీస్‌కు కోడెల భౌతికకాయాన్ని తరలించనున్నారు.

Related posts