kodandaram on kcr warning to rtc employees

ఆర్టీసీ కార్మికులను బెదిరించడం సరికాదు : కోదండరాం

29

ఈ నెల 11న సమ్మెకు పిలుపునిచ్చిన ఆర్టీసీ కార్మికులను ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరించడం సరికాదని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ చేసిన ప్రకటనపై స్పందించిన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లపై చర్చించకుండా సీఎం కార్మికులకు వార్నింగ్ ఇవ్వడం సరికాదన్నారు.

రాష్ట్రంలో ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని ఆయన విమర్శించారు. ఆర్టీసీపై డీజిల్ రేట్ల భారాన్ని ప్రభుత్వమే భరించాలని ఆయన డిమాండ్ చేశారు. సమ్మె అనివార్యమైతే ఆర్టీసీ సమ్మెకు టీజేఎస్‌ మద్దతు ఉంటుందని కోదండరాం స్పష్టం చేశారు.