telugu navyamedia
సినిమా వార్తలు

“కొబ్బరి మట్ట” ట్రైలర్

Kobbari matta

“హృదయ కాలేయం”, “సింగం 123” తర్వాత కొన్ని చిత్రాల‌లో స‌పోర్టింగ్ రోల్స్ చేసిన సంపూ ఇప్పుడు “కొబ్బరి మ‌ట్ట” చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మయ్యాడు. బ‌ర్నింగ్ స్టార్ గా అభిమానుల‌చే పిల‌వ‌బడుచున్న సంపూ 2015లో “కొబ్బ‌రి మ‌ట్ట” అనే చిత్రం మొద‌లు పెట్టాడు. ఈ చిత్రం ఎట్ట‌కేల‌కి ఆగ‌స్ట్ 10న విడుద‌ల‌య్యేందుకు సిద్ద‌మైంది. ఈ చిత్రానికి రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు సంపూ. ఈ సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని టీం చెబుతుంది. ఈ క్ర‌మంలో చిత్ర ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచారు. ఈ సినిమా ఆగస్ట్ 10న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర ట్రైలర్‌ను డైరెక్టర్ మారుతి విడుదల చేశారు. ట్రైలర్ లో “పిండి లో‌ మీ చెమట పడుతోంది అంటే రెండు చెంచాలు ఉప్పు తక్కువ వెయ్యి ఎంతైనా మనం పేదవాళ్ళం కదా” అని సంఫూ డైలాగ్ లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఒకా నొక సంధర్భం‌లో‌ సంపూ‌ కార్ ని పైకి లేపడం చూస్తే బాహుబలి కన్నా బలశాలి గా కనిపిస్తాడు. అంతే‌కాక తన వెస్టెర్న్ మరియు క్లాసికల్ రెండు రకాల డాన్స్ పర్ఫార్మెన్స్ తో సంపూ‌ ఉర్రూతలూగించాడు. ఎన్నో అవాంతరాల తరువాత దాదాపు రెండు సంవత్సరాల తరువత విడుదలకు నోచుకున్న ఈ‌ సినిమా సంపూకు ఈ సినిమా మంచి హిట్ ఇవ్వాలని కోరుకుందాం.

Related posts