telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీ మూడు ఫార్మాట్లను నడిపించటం అంత సులువు కాదు…

డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం కోహ్లీ సేన యూకే పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన మోరె.. రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘బోర్డు ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటుందని అనుకుంటున్నా. రోహిత్​ శర్మకు త్వరలోనే భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం వస్తుందనుకుంటున్నా. ధోనీ ఆధ్వర్యంలో కోహ్లీ తెలివిగల సారథిగా వృద్ధి చెందాడు. ఎంతకాలం వన్డేలు, టీ20లకు కెప్టెన్​గా ఉండాలని అనుకుంటాడు? అతడు కూడా ఈ విషయమై ఆలోచిస్తాడు. ఇంగ్లండ్​ పర్యటన తర్వాత దీనిపై స్పష్టత వస్తుంది. కోహ్లీ.. కెప్టెన్సీ బాధ్యతల్ని రోహిత్​తో పంచుకుంటే భవిష్యత్ తరాలకు ఓ బలమైన సందేశాన్ని ఇచ్చినట్లవుతుంది. భారత్​లో ఒక్కో ఫార్మాట్​కు ఒక్కో కెప్టెన్​ అనే పంథా సెట్​ అవుతుంది. టీమిండియా భవిష్యత్​ను తీర్చిదిద్దటం ఎంతో ముఖ్యమని సీనియర్​ ఆటగాళ్లు భావిస్తారు. కోహ్లీ ఒక్కడే మంచి ప్రదర్శన చేస్తూ.. మూడు ఫార్మాట్లను నడిపించటం అంత సులువు కాదు. ప్రస్తుతం అతను కెప్టెన్​గా జట్టును గెలిపిస్తూ బాగానే ఆడుతున్నాడు. అయితే.. ‘ఇక చాలు.. రోహిత్ ఇకపై నా బాధ్యతలు పంచుకుంటాడు’ అని ఏదో ఒక రోజు అంటాడని అనుకుంటున్నా.​ తప్పకుండా ఇది మన భవిష్యత్​ తరాలకు ఓ మంచి బలమైన సందేశంగా మారుతుంది. ఏదేమైనప్పటికీ ఇదంతా విరాట్​ మీద అధారపడి ఉంటుంది. అతడు మనిషే కదా, తన మెదడూ అలిసిపోతుంది కదా” అని మోరె చెప్పుకొచ్చాడు.

Related posts