kim trump meeting completed in singapore

ముగిసిన చారిత్రాత్మక సమావేశం…

85

ప్రపంచం ఎదురుచూస్తున్న ట్రంప్ కిమ్ ల భేటీ ముగిసింది, సింగపూర్ లో జరిగిన ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తొలిసారి కరచాలనం చేసుకోగా, ఏడాదిన్నర కాలం నుంచి రెండు దేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతల మధ్య జరిగిన ఈ భేటీ పలువురిలో ఆసక్తిని రేకెత్తించింది. అణ్వస్త్ర రహిత దేశంగా మారాలన్నదే ప్రధాన అజెండా గా ఈ సమావేశం జరిగింది.

kim trump meeting completed in singapore

కిమ్-ట్రంప్ ల మధ్య దాదాపు 45 నిమిషాలపాటు ఏకాంత చర్చలు కొనసాగగా, రెండుదేశాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే ఉత్తర కొరియా తమ అణు రీచ్ లను ధ్వంసం చేసింది, కానీ ఆయుధాలను మాత్రం అలాగే ఉంచుకుంది. దీనికి తోడు న్యూక్లియర్ కి సంబందించిన ప్రధాన షరతులకు కిమ్ ఒప్పుకోలేదు, గతంలో హెచ్చరికల ద్వారా కిమ్ ను దారిలోకి తీసుకొచ్చిన ట్రంప్ చర్చలకు ఒప్పించారు. చైనా వంటి ఉత్తర కొరియా మిత్రు దేశాల ద్వారా తీవ్ర హెచ్చరికలు, బుజ్జగింపులు చేయించి చివరకు చర్చలకు ఒప్పించగా, దూకుడుగా వ్యవహరించే ఈ ఇద్దరిలో చర్చలకు వందల మెట్లు దిగొచ్చిన ఉత్తర కొరియా అధినేత వ్యవహార ధోరణి ఆసక్తి కరంగా మారింది.

అణు నిరాయుధీకరణ విషయంలో ఉత్తర కొరియా పై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్న అమెరికాకు, ఉత్తర కొరియా మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అనుకున్న సమయానికి సింగపూర్ చేరుకున్న ఇరు దేశాధినేతలు చారిత్రాత్మకమైన సమావేశానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అమెరికాకు చెందిన 10 రకాల నిఘా సంస్థలు గస్తీ కాయగా, ఆరంచలా భద్రతా వలయంలో మూడు రకాల శాటిలైట్లు సింగపూర్ ని గమనిస్తున్నాయని అమెరికా స్పష్టం చేసింది. మరోవైపు కిమ్ భద్రత కూడా అదే రేంజ్ లో ఉంది.

తమ దేశంనుంచి భద్రతా దళాలు వచ్చినా ఆయుధం ధరించి సమావేశానికి హాజరు అవొద్దని సింగపూర్ నిబంధనలు విధించింది. దీనితో ఒక కిలోమీటర్ అవుతలనే వారి సాయుధులు గస్తీ కాస్తున్నారు.  ఇకపై ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉండనున్నాయని ఇరువురు దేశాధినేతలు ఏకీభవించగా అణు నిరాయుధీకరణ దిశగా తొలి అడుగు వేస్తున్నామని ట్రంప్ తెలిపాడు. చర్చలు సఫలమవడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ను వైట్ హౌస్ కు ఆహ్వానించాడు. శాంతి దిశగా పెద్ద అడుగు ముందుకు పడిందని, ఈ సమావేశం ఊహించిన దానికన్నా ఇంకా బాగా జరిగిందని ఇరువురు నేతలు తెలిపారు. 

ఇకపై ఇరు దేశాల మధ్య అవరోధాలు అధిగమిస్తామని, ఈరోజు జరిగిన ఒప్పందాలపై త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తెలిపారు.