ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత డాక్టర్ ఎస్ఏ ఖలీల్ బాషా నిన్న హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతి చెందారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించిన డాక్టర్ బాషా 1994, 1999లలో కడప నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్‌లలో పనిచేశారు. ఆ తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు.
2019 ఎన్నికలకు ముందు తన ముగ్గురు కుమారులతో కలిసి వైసీపీలో చేరారు. గత నెల 30న కరోనా బారినపడిన డాక్టర్ బాషా హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. అయితే, మూడు రోజుల క్రితం గుండెనొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో నిన్న సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
బీజేపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు: కన్నా