ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్ కంపెనీ కేఎఫ్‌సీ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. చికెన్ తినని వారిని కూడా ఆకర్షించేందుకు మొక్కలతో చేసిన మాంసంతో వింగ్స్, నగ్గెట్స్ ఇతర ఉత్పత్తులను తయారుచేసింది. బియాండ్ మీట్ అనే కంపెనీ భాగస్వామ్యంతో అమెరికా జార్జియాలోని స్మైర్నా ప్రాంతంలో ఉన్న ఓ కేఎఫ్‌సీ రెస్టారెంట్‌లో మంగళవారం ఈ ప్రయోగం చేయనున్నారు. మొక్కలతో చేసిన వింగ్స్, నగ్గెట్స్ తదితర ఉత్పత్తులను రెస్టారెంట్‌లో విక్రయించనున్నారు. మొక్కలతో చేసిన మాంసం కూడా నిజమైన మాంసంలానే ఉంటుందని కేఎఫ్‌సీ యూఎస్ ప్రెసిడెంట్ కెవిన్ హాచ్‌మేన్ తెలిపారు. వీటిని టేస్ట్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్ కేఎఫ్‌సీలో ఇంతకుముందు తిన్న వింగ్స్‌లానే ఉన్నాయంటూ కితాబివ్వడం ఖాయమని ఆయన అన్నారు. మంగళవారం కస్టమర్లు వీటిని కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా బర్గర్ కింగ్ ఈ ఏడాది మొదట్లోనే మీట్ లెస్ సిగ్నేచర్ బీఫ్ హ్యామ్‌బర్గర్‌తో ముందుకొచ్చింది. వెజిటేరియన్ కస్టమర్లను కూడా తమవైపు ఆకర్షించేందుకే ప్రముఖ ఫాస్ట్‌పుడ్ రెస్టారెంట్లు ఇలా మీట్ లెస్ వైపు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ బుజ్జగింపు రాజకీయాలు: అమిత్‌షా