telugu navyamedia
తెలంగాణ వార్తలు

జాతీయ రాజకీయాలపై కేసీఆర్ సమాలోచనలు..

సీపీఎం, సీపీఐ జాతీయ నాయకుల భేటీ
ప్రగతి భవన్ వేదికగా జాతీయరాజకీయలపై చర్చలు

తెలంగాణ ప్రగతి భవన్ జాతీయ రాజకీయాలకు చర్చావేదిగా మారింది. నిన్న మొన్నటిదాకా … జాతీయస్థాయిలో రాజకీయ సమీకరణలకోసం తాపత్రయపడుతున్న తెలంగాణ రాష్ట్రసమితి వ్యవస్థాపకులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా జాతీయస్థాయిలో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకోసం… జాతీయస్థాయి రాజకీయ పక్షాల అధినేతలతో సమాలోచనలు చేశారు.

Top leaders of CPI, CPM meet CM KCR

జాతీయ రాజకీయ పార్టీల నేతలతో ప్రగతి భవన్ కళకళలాడింది. సీపీయం, సీపీఐ అగ్రనేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల జాతీయస్థాయిలో పోరాట పంధాపై సుధీర్ఘంగా చర్చించారు. ఉభయ కమ్యునిస్టు పార్టీల నేతలు వేర్వేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు.

పార్టీ ఏదైనా సరే… అజెండా ఒక్కటే… భవిష్యత్తులో రాజకీయ పొత్తులు… ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలను దెబ్బతీయాలని నిర్ణయించారు. కేరళ ముఖ్యమంత్రి  వినరయి విజయన్, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, త్రిపుర మాజీ సిఎం మాణిక్ సర్కార్, సిపిఎం కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు రామచంద్రన్ పిల్లై , బాల కృష్ణన్, ఎం ఎ బేబీ తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సిపిఐ పార్లమెంటరీ పార్టీ పక్షనేత, కేరళ ఎంపీ బినయ్ విశ్వం, కేరళ రెవిన్యూశాఖ మంత్రి రాజన్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

కమ్యూనిస్టు నాయకులను రాష్ట్ర మంత్రులు కెటిఆర్, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జె. సంతోష్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి ఘనంగా స్వాగతించారు. ప్రగతిభవన్లో సీపీఎం, సీపీఐ జాతీయనాకులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సత్కరించారు.

Related posts