kejriwal-fans-march-for-democracy

కేజ్రీవాల్ దీక్షకు మద్దతుగా ర్యాలీ…

16

ఆమ్ ఆద్మీ పార్టీనేతలు ఈరోజు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటినుంచి పాదయాత్ర చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఢిల్లీలోని రాజ్ నివాస్ లో దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అయితే హక్కులను సాధించేంతవరకు తమ పోరాటం ఆగదని తెగేసి చెప్పిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఇప్పటికైనా స్పందించి డిమాండ్లను అమలు చేయాలనీ కోరుతున్నారు.

రేషన్ సరుకులను ఇంటివద్దకె పంపించేందుకు ఆమోదం మరియు ఆందోళన చేస్తున్న ఐ.ఏ.ఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్లపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్ తో పాటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మంత్రులు సత్యేంద్ర కుమార్ చైన్, గోపాల్ రాయ్ లు ఉన్నారు. అయితే సత్యేంద్ర కుమార్ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టాడు.