telugu navyamedia
సినిమా వార్తలు

కీర్తి సురేష్ బాలీవుడ్ సినిమా ఇదే

Keerthy-Suresh

“మహానటి” చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించేంసింది. సావిత్రిని మళ్ళీ వెండితెరపై అచ్చుగుద్దినట్టుగా దింపేసింది. అలనాటి సావిత్రిగా “మహానటి”లో కీర్తి నటనకు జాతీయ అవార్డు కూడా దక్కింది. ఇక కీర్తి బాలీవుడ్ ఎంట్రీ గురించి కొన్నిరోజులుగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఇండియన్ ఫుట్‌బాల్ అని చెప్పుకునే 1952-62 సమయంలో ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ కోచ్‌గా పనిచేసిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్ ఇది. ఇందులో ఏషియన్ గేమ్స్‌లో ఇండియన్ టీమ్‌ను విజేతగా నిలపడానికి సయ్యద్ కష్టాన్ని తెరపై ఆవిష్కరించనున్నారు. సయ్యద్ పాత్రలో అజయ్ దేవగణ్ నటిస్తుంటే.. ఆయన జతగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. బోనీకపూర్, ఆకాశ్ చావ్లా, అరుణవా జోయ్ సేన్‌గుప్త, జీ స్టూడియస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి “మైదాన్” అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సినిమా చిత్రీకరణ కూడా ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

Related posts