telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇది నా జీవితంలో అద్భుతమైన మైలురాయి : కీర్తి సురేష్

Keerthy-Suresh

కీర్తి సురేష్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే నాగార్జున “మన్మథుడు-2” చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం కీర్తి సురేష్ మిస్ ఇండియా, పెంగ్విన్ లాంటి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. “మహానటి”తో జాతీయ ఉత్తమ నటిగా నిలిచిన కీర్తి సురేష్ తాజాగా మరో వార్తను షేర్ చేసింది. తన అభిమాన నటుడు, దక్షిణాది సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమాలో నటించబోతున్నట్టు తెలిపింది. తన జీవితంలో ఇదొక మైలురాయి అని ట్వీట్ చేసింది. సూపర్‌స్టార్ రజినీకాంత్ 168వ సినిమాను దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ మీనా నటిస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ కూడా నటించబోతోందంటూ ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను కీర్తి తాజాగా ధ్రువీకరించింది. “నా జీవితంలో అద్భుతమైన మైలురాయికి సంబంధించిన వార్తను మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. రజినీ సర్‌తో కలిసి నటిస్తుండడం నా జీవితంలో అత్యంత సంతోషకర జ్ఞాపకంగా మిగలబోతోంది. సన్‌పిక్చర్స్‌కు, దర్శకుడు శివగారికి ధన్యవాదాలు” అని కీర్తి ట్వీట్ చేసింది.

Related posts