modi and kcr

నేడు ఢిల్లీకి చంద్రశేఖరుడు

17

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోడీతో చర్చించనున్నారని తెలిసింది. కొత్త జోన్లపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఢిల్లీకి వెళుతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఇప్పటికే రైతుబంధు పథకం, మిషన్ భగీరథ లాంటి పథకాలతో ప్రజల మెప్పు పొందుతున్న కెసిఆర్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు.

అయితే మోడీ ఈరోజు చత్తిస్గఢ్ పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఛత్తీస్గఢ్ చేరుకొన్న తరువాత భిలాయ్ ఉక్కు కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు మోడీ. ఆ తరువాత జగదల్ పూర్, రాయపూర్ మధ్య విమాన సర్వీసులు ప్రారంభించనున్నారు.