తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో కేసీఆర్ చర్చించనున్నారు. విభజన హామీల పరిష్కారం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలపై ప్రధానితో చర్చించే అవకాశం ఉంది.
అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, నిధుల శాతం కూడా పెంచాలని ప్రధానిని కోరుతున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన మరికొన్ని అంశాలపై వీరిద్దరు చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలవనున్నారు.
ఇచ్చిన వాగ్ధానాలకు బడ్జెట్‌కు పొంతన లేదు: టీడీపీ నేత అనురాధ