telugu navyamedia
తెలంగాణ వార్తలు

అభివృద్ధిలో దేశానికే దిశానిర్దేశం చేసే రాష్ట్రంగా తెలంగాణ మారింది..

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి నేటితో 8 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన రాష్ట్రావతరణ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ప్రజలందరికీ రాష్ట్రావిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… అభివృద్ధిలో దేశానికే దిశానిర్దేశం చేసే రాష్ట్రంగా తెలంగాణ మారిందని అన్నారు.

ఎనిమిదేళ్లలో వృద్ధిరేటులో దేశంలోనే అగ్రస్థాయిలో నిలిచాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఎనిమిదేళ్లలో అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించామని వెల్లడించారు. పెరిగిన ఆదాయంతో ప్రతి పైసాను అభివృద్ధికి వినియోగిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణ శిఖరాగ్రాన నిలిచిందన్నారు.

విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించామని.. ప్రస్తుతం 4,400 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రకటించారు.జాతీయ తలసరి ఆదాయం కంటే.. తెలంగాణ తలసరి ఆదాయం ముందుందని తెలిపారు. మిషన్ భగీరథ పథకంతో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని, అతి తక్కువ కాలంలో మిషన్ తెలంగాణ సక్సెస్ సాధించామన్నారు. మంచినీరు దొరకని ప్రాంతం తెలంగాణలో లేదన్నారు. .

రాష్ట్రంలో బిందెల కొట్లాట, తాగునీటి కోసం యుద్ధాలు లేవన్నారు. దేశంలో అత్యుత్తమ వైద్యసేవలు అందించే తొలి 3 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణ ఏర్పడిన తర్వాత లక్షా 35వేల ఉద్యోగాలు భర్తీ చేశామ‌ని అన్నారు.. మరో 90వేలు భర్తీ చేస్తున్నాం. స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్నామ‌ని తెలిపారు.

సమైక్య రాష్ట్రంలో అప్పులతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేసీఆర్ పేర్కొన్నారు తెలంగాణ వచ్చాక రైతు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించామని.. రాష్ట్రం సజల, సుజల, సస్యశ్యామల తెలంగాణగా మారిందని కేసీఆర్‌ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే ఓ అపూర్వ ఘట్టం. కేవలం మూడేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తిచేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచాం. సకాలంలో రైతులకు ఎరువులు అందిస్తున్నాం. కల్తీ విత్తనాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామ‌ని అన్నారు.

‘గూడు లేని నిరుపేదలకు సొంత ఇంటి కళను తీర్చటమే కాకుండా.. గౌరవ ప్రదమైన నివాసాలని ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నద‌ని అన్నారు. దేశంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళని పూర్తి ఉచితంగా నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇప్పటివరకు 2లక్షల 91వేల ఇండ్లు మంజూరు చేసినం. దీని కోసం 19126 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. సొంత స్థలం కలిగిన వారికి.. డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణానికి దశల వారీగా 3లక్షలు మంజూరు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ బస్తీలలో నివసించే పేదల సమీపంలోకి వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం 350 బస్తీ దవాఖానాలను మంజూరు చేసింది. వీటిలో 256 దవాఖానాలు ఇప్పటికే సేవలందిస్తున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మరో 60 బస్తీదవాఖానాలను కొత్తగా ప్రారంభించబోతున్నది. బస్తీ దవాఖానాలు ఇచ్చిన స్ఫూర్తితో గ్రామాలలో ప్రాథమిక వైద్య సేవలను అందించడం కోసం ప్రభుత్వం పల్లె దవాఖానాలను ఏర్పాటుచేస్తోంది.” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

మత్స్యకారుల జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. చెరువులు, జలాశయాల్లో చేపపిల్లలు వేస్తున్నాం. మత్స్యకకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నాం. నేత కార్మికులకు బతుకమ్మ చీరల తయారీ బాధ్యతలు అప్పగించడం జరిగింది. తెలంగాణలో కొత్తగా 192 మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేశాం. తెలంగాణ ప్రభుత్వ చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అన్ని గూడాలు, తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చాం. యాదాద్రి క్షేత్రాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాం. జలాశయాల వద్ద టూరిస్టు స్పాట్‌లు అభివృద్ది చేస్తున్నామ‌ని అన్నారు.

Related posts