kcr-pachayati-election-plan

ఎమ్మెల్యేలకు సవాలుగా మారిన ‘పంచాయితీ’!

18

తెలంగాణా రాష్త్ర ప్రభుత్వం జులై నెలలో నిర్వహించనున్న పంచాయితీ ఎన్నికలు అధికార తెరాస పార్టీకీ సవాలుగా మారినట్టు స్పష్ష్టమవుతోంది. ఇంటలిజెన్స్, సర్వే రిపోర్టులను క్షున్నంగా పరిశీలించిన ముఖ్య మంత్రి కేసీఆర్ 35 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు, వారు తమ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరికలు సైతం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో పంచాయతి ఎన్నికలకు గడువు సమీపిస్తుండగా ప్రజల్లో వ్యతిరేఖత ఉన్న ఆయా జిల్లాలోని అధికార తెరాస పార్టీ ఎమ్మెల్యేలకు ఈ పంచాయితీ ఎన్నికలు సవాలుగా మారనున్నాయి. ఇప్పటికే పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి, పంచాయితీలో పవర్ చూపించాలని కేసీఆర్ సూచిందడంతో డేంజర్ జోన్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పార్టీ ని గెలిపించేందుకు వ్యూహరచన చేస్తున్నారు.

ఇప్పటి నుండే క్యాడరు ను పెంచుకునేందుకు గ్రూపులుగా ఉన్న కార్యకర్తలు ఏకతాటిపై తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న మండల పార్టీ కార్యకర్తలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. అధికార పార్టీకి వ్యతిరేకత ఉన్న పంచాయితీలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. త్వరలో రిజర్వేషన్ ప్రక్రియ వెలువడనున్న దృష్ట్యా పట్టున్న అభ్యర్థులను ఎంపిక చేసుందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

అధికార యంత్రాంగం పంచాయితీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించడంతో జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు మండల స్థాయిలో పంచాయితీ ఎన్నికల పై సమీక్షపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే స్టేజి-1, స్టేజి-2 రిటర్నింగ్ అధికారులను నియమించారు. ఆయా గ్రామ పంచాయితీల రిజర్వేషన్లు త్వరలో వెలువడనున్న దృష్ట్యా గ్రామాల్లో ఇప్పటి నుండి పలు పార్టీలు అభ్యర్థుల కోసం అన్వేషణ చేపట్టారు. అధికార తెరాస పార్టీ మాత్రం ఈ పంచాయితీ ఎన్నికలను సవాలుగా స్వీకరిస్తూ, ఇప్పటి నుండే గ్రామ స్థాయిలో సమావేశాలను నిర్వహిస్తున్నారు. కేసీఆర్ పంచాయితీలో పవర్ చూపించాలని సూచించడంతో ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటూ, కార్యకర్తలను ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్నారు.