telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పొరుగు రాష్ట్రాల్లో మద్యం ఓపెన్ … ఇక తెలంగాణలో కూడా .. ?

liquor shops ap

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పలు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు 7వ తేదీ వరకూ తెలంగాణలో లాక్ డౌన్ అమలులో ఉండనుంది. దీంతో సోమవారం నాడు మద్యం రాష్ట్రంలో షాపులు తెరచుకోలేదు. లాక్ డౌన్ సమయంలోనూ మద్యం విక్రయాలను అనుమతించాలని ఎంతగా ఒత్తిడి వచ్చినా, వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని మద్యం దుకాణాలను అనుమతించే ప్రసక్తే లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఇక, కేంద్రం ఇచ్చిన తాజా సడలింపులతో పక్క రాష్ట్రాల్లో లిక్కర్ షాపులు తిరిగి తెరచుకున్నాయి.

పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ లో షాపులు తెరవడంతో ఇక్కడ కూడా తెరవాల్సిన పరిస్థితి నెలకొందని, లేకుంటే అక్కడ నుంచి మద్యం అక్రమ రవాణాతో వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని, నిన్న కేసీఆర్ కు వివరించిన అధికారులు, మద్యం కోసం సరిహద్దులను దాటి పక్క రాష్ట్రాలకు ప్రజలు వెళ్లే అవకాశం ఇవ్వవద్దని సూచించారు.

పక్క రాష్ట్రాల నుంచి మద్యం స్మగ్లింగ్ పెరిగిపోతుందని వారు గుర్తు చేశారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలపై నేడు జరిగే క్యాబినెట్ సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రం ప్రకటించిన సడలింపులకూ ఓకే చెబుతూ, మిగతా రాష్ట్రాల మాదిరిగానే, కంటైన్ మెంట్‌ జోన్లలో మినహా మిగిలిన చోట్ల మద్యం విక్రయాలకు అనుమతించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related posts