kcr-going-to-delhi

హస్తినలో కెసిఆర్, సాదించుకొచ్చేనా…ఏమైనా…?

14

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీకి చేరుకున్నారు, రేపు మధ్యాహ్నం ప్రధాని మోడీ తో సమావేశం కానున్నారు. నాలుగు రోజులపాటు ఢిల్లీలోనే ఉంటారు, ఈ నెల 17 న జరిగే నీతి ఆయోగ్ ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం, రిజర్వేషన్ల పెంపుపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే రాష్ట్రానికి రావలసిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులు సమకూర్చాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరనున్నారు, అంతే కాకుండా హైకోర్టు విభజన, ఎయిమ్స్‌కు నిధులు మంజూరు, ప్రాజెక్టులకు సహకారం, పన్నులలో వాటా పెంపు, మరియు పెండింగ్‌బిల్లుల విడుదల తోపాటు రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై సీఎం కేసీఆర్ ప్రధానితో చర్చించే అవకాశం ఉన్నది.

ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించాక తొలిసారి కెసిఆర్ మోడీతో భేటీ అవుతుండడం ఉత్కంఠ రేపుతోంది. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో పార్టీ ముఖ్యులతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన రైతు భీమా పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు కానున్న సందర్భంగా, ముఖ్య అతిధిగా ప్రధానిని ఆహ్వానించనున్నారు.

ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు బందు పథకం, రైతు భీమా పథకం మరియు కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రుల వేదిక సదస్సుగా జాతీయ స్థాయిలో అందరికి తెలిసే విదంగా చేయాలనుకుంటున్నారు. అలాగే విభజన చట్టంలో నేరవేరని హామీలను సంబందించిన కేంద్ర శాఖాధికారులతో చర్చించనున్నారు.

ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ మొత్తం తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందని, దానిని తమకే ఇవ్వాలని ప్రధానిని కోరానున్నారని సమాచారం, నిజాం నవాబులు నిర్మించిన హైదరాబాద్‌ హౌస్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకుందని, పరిహారంగా మాకు ఈ భూమిని కేటాయించిందని, ఈ ఆస్తి మొత్తం పూర్వ నిజాం ప్రభుత్వానికే చెందుతదని వివరించనున్నారు.

గతంలో రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ప్రధాని అపాయింట్ మెంట్ కోరగా, విదేశీ పర్యటన దృష్ట్యా అపాయింట్ మెంట్ లభించలేదు అన్న విషయం తెలిసిందే.