BREAKING NEWS:
kcr fire on konda family

కొండా ఫ్యామిలీకి కేసీఆర్ క్లాస్.. ?

32

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళి కి కేసీఆర్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీ కాదని ఇష్టానుసారంగా వ్యవహారిస్తే ఉపేక్షించేది లేదని, వైకాపా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీరిని ఆదరించి తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం అనంతరం టిక్కెట్లు ఇచ్చి పదవులు కట్టబెడితే పార్టీకే చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూధనా చారి ప్రాతినిత్యం వహిస్తున్న భూపాలపల్లి నియోజకవర్గం పై కొండా దంపతులు దృష్టి కేంద్రీకరించారు.

ఇప్పటికే వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ గా కొనసాగుతున్న కొండా దంపతులు ఇప్పుడు తాజాగా తమ కూతురు రాజకీయ ఆరంగ్రేటం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో సురేఖ ప్రాతినిత్యం వహించిన పరకాల, భూపాలపల్లి, ఎదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు స్పష్టమవుతున్నాయి. ఇందుకోసం వ్యూహాత్మకంగా వ్యవహారిస్తూ పావులు కదుపుతున్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ సొంత పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్ కు ఎసరు తెస్తూ ఆయా నియోజకవర్గాల్లో వర్గాలు ఏర్పాటు చేస్తూ, పార్టీకే చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నటు కేసీఆర్ కు పిర్యాదులు అందాయి. దీని పై నివేదిక తెచ్చుకొన్న కేసీఆర్ వీరిద్దరి తీరు పై ఆరాతీశారు.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇదే సరైన సమయమని భావించి కొండా దంపతులు ఇప్పుడున్న వరంగల్ తూర్పుతో పాటు భూపాలపల్లి పరకాలలో ఎదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే ప్రచారం కొనసాగుతుంది. ఇలా సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఆయా నియోజకవర్గాల్లో కొండా దంపతులు వర్గాలు ఏర్పాటు చేసుకోవడం పై కేసీఆర్ సీరియస్ అయినట్టు సమాచారం.