kcr decision on tsrtc

ఆర్టీసీ ప్రక్షాళనకు కార్యాచరణ : కేసీఆర్

10

ఆర్టీసీ ఉద్యోగులు ఈ నెల 11న సమ్మె చేపడుతామని నోటీస్ ఇచ్చిన తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను తో భేటీ అయ్యారు. టీఎస్‌ఆర్టీసీని త్వరలో పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని కేసీఆర్‌ గవర్నర్‌కు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన ఆర్టీసీ పనితీరు ఆశించిన స్థాయిలో లేదని, తీవ్రమైన నష్టాలలో కూరుకుపోయిందని, ప్రజారవాణా సంస్థను దివాలా తీయించే ప్రయత్నాలను అడ్డుకుంటామని, కఠినచర్యలకు దిగుతామని వెల్లడించారు.

ఆర్టీసీలో సమ్మె నోటీసు, రైతుబంధు, జీవితబీమా తదితర అంశాలపై చర్చించారు. ఆర్టీసీపై గవర్నర్‌కు నివేదిక ఇచ్చారు. రాష్ట్ర విభజన నాటికి తీవ్రమైన నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించాలని ప్రత్యేక చర్యలు చేపట్టామని, సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు, కార్మికులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా వారికి వేతనాలను పెంచామని తెలిపారు. అయినా సంస్థ పనితీరులో ఎలాంటి మార్పు లేదని, నష్టాలు మరింతగా పెరిగాయని, తాజాగా రూ.1,400 కోట్ల మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ, ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయని తెలిపారు. కార్మిక సంఘాలకు మంత్రుల కమిటీ ద్వారా వాస్తవాలను తెలియజేశామని, సమ్మె నివారణకు చర్యలు చేపట్టామని, అనివార్యమయితే ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని తెలిపారు.