telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కత్రినా న్యూ ఇయర్ సంబరాలు… మైనస్ డిగ్రీల నీటిలో

Katrina-Kaif

న్యూ ఇయర్ వేడుకలను సెలెబ్రిటీలంతా ఎంతో సంబరంగా జరుపుకుని… కొత్త సంవత్సరానికి సాదరంగా ఆహ్వానం పలికారు. అయితే ఇప్పుడు కత్రినా షేర్ చేసిన వీడియో చూస్తే మాత్రం “ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం” అని అనాలనిపిస్తుంది. ఎందుకంటే అందరికంటే చాలా వైవిధ్యంగా కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకుంది కత్రినా. ప్రస్తుతం యూరప్ లో ఉన్న కత్రినా అక్కడే ఈ వేడుకలను జరుపుకుంది. ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీల్లోకి పడిపోయిన పశ్చిమ యూరప్ లోని ఇంగ్లిష్ ఛానల్ వద్దకు వెళ్లి, అందులో ఈత కొట్టింది. ఇక్కడి నీటిలో తన తల్లి, సోదరితో కలిసి ఈతకొట్టిన కత్రిన, ఈ వీడియోను తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసింది. అంతేకాదు సముద్రంలో ఈత కొడితే చాలా బాగుంటుందని, కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల మాట వినాలని, శరీరాన్ని, మనసును ఒకే చోట ఉంచాలని ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టింది. ఇక కత్రిన పెట్టిన ఈ వీడియోకు గంటల్లోనే లక్షల లైక్స్ వచ్చాయి. కత్రినా చేసిన సాహసాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఈ సమయంలో అక్కడి సముద్రంలో ఈత కొట్టడానికి ఎవ్వరూ సాహసం చేయరు.

Related posts