sanjana-anne

సంజన ప్రవర్తనతో లాభమెవరికి ? నష్టమెవరికి ?

13

ఆదివారం వైభవంగా మొదలైంది బిగ్ బాస్-2. అయితే బిగ్ బాస్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎన్టీఆర్, బిగ్ బాస్-2కు వ్యవహరించట్లేదని తెలిసిన చాలా మంది అభిమానులు నిరాశ చెందారు. బిగ్ బాస్-2కు నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 16 మంది కంటెస్టెంట్ల బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంట్లో 13 మంది సెలెబ్రిటీలు కాగా ముగ్గురు మాత్రం సామాన్యులు కావడం విశేషం. అయితే ఆదివారం ప్రారంభమైన ఈ షో ఇప్పటికి అదే జోష్ తో కొనసాగుతోంది.

ఇప్పుడిప్పుడే ఈ బిగ్ బాస్ హౌస్ లో గొడవలు మొదలవుతున్నాయి. మోడలింగ్ నుంచి బిగ్ బాస్ కు సెలెక్ట్ అయిన సంజన పక్కా గేమ్ ప్లాన్ తో హౌస్ లోకి ఎంటర్ అయినట్టుగా భావిస్తున్నారు వీక్షకులు. మోడల్ గా కెరీర్ సాగిస్తున్న సంజన బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వస్తే సెలెబ్రెటీగానే బయటకు రావాలని ఫిక్స్ అయినట్టుగా కన్పిస్తోంది. ఎందుకంటే నిన్న జరిగిన లగ్జరీ బడ్జెట్ గేమ్ లో బాబు గోగినేనితో గొడవ పెట్టుకుంది సంజన. ఆమె ప్రవర్తనతో హౌజ్ లో ఉండేవారికి దూరమవుతోంది. రెండు రోజులు జైల్లో బందీ అయిన సంజన, తాను బందీ కావటానికి కారణమైన వారిపై కక్ష కట్టింటి.

ఇక బిగ్ బాస్-2లో ఏమైనా జరగొచ్చు అని క్లూ ఇచ్చిన నాని, ఏం జరుగుతుందనే విషయాన్ని మాత్రం సస్పెన్స్ లో పెట్టారు.

ఇదిలా ఉండగా కత్తి కార్తీక బిగ్ బాస్-2 పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్-2లో మసాలా ఉంది. కానీ ఫ్లేవర్ మిస్ అయ్యిందని, తెలంగాణ నుంచి ఒక్క కంటెస్టెంట్ కూడా లేరని, ఒక్కరైనా తెలంగాణ కంటెస్టెంట్ ఉంటే ఫ్లేవర్ కూడా మిస్ అయ్యేది కాదని చెప్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.