కర్ణాటక సీఎం కుమారస్వామి విశ్వాస పరీక్ష ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విశ్వాస పరీక్ష ఆలస్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటూ జ్యోతిష్యులు కుమారస్వామిని హెచ్చరించారు. సాధ్యమైనంత త్వరగా ఈ పరీక్షను ఎదుర్కొంటేనే కుమారస్వామికి మంచిదని ఆలస్యమైతే , ఇబ్బందేనని జ్యోతిష్యులు చెప్పినట్టు కన్నడ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఇది వైరల్ కావడంతో జ్యోతిష్యుల సూచనలు జేడీఎస్ తోసిపుచ్చింది.
బీజేపీ నేతలు కావాలనే ఈ తరహా ప్రచారాన్ని ప్రారంభించారని వారు ఆరోపించారు. కాగా, శనివారం నాడు ‘రైట్ లాగ్’ న్యూస్ బ్లాగ్ లో పలువురు జ్యోతిష్యులు, కుమారస్వామి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తూ, ఆయన వెంటనే విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని తెలిపారు. ఆలస్యం చేస్తే అది జేడీఎస్ కు తీరని నష్టాన్ని మిగులుస్తుందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో బీజేపీ ఓ కలుపు మొక్కను నాటిందని, ఇలాంటి దుష్ప్రచారాలు ఎంతో కాలం నిలవలేవని అని జేడీఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.