telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

గుడ్ ఇడియా కాకిని పెంచాడు..రోజుకు రెండు వేలు సంపాదిస్తున్నాడు!

crow busness

కర్ణాటకలో ఓ కాకిని పెంచుకుంటున్న యువకుడు, రోజుకు రూ. 2 వేల వరకూ సంపాదిస్తున్నాడు. కాకితో అతను ఏం చేస్తున్నాడో తెలుసా? కాకి కావాలంటూ తనను సంప్రదించిన వారి వద్దకు దాన్ని తీసుకెళ్లి, పిండాలను తినిపించడమే. హిందూ సంప్రదాయంలో ఎవరైనా మరణిస్తే, పిండాలను కాకి ముట్టుకుంటేనే మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని నమ్ముతారన్న సంగతి తెలిసిందే.

ఇక పట్టణ ప్రాంతాల్లో కాలుష్యం కారణంగా కాకుల సంతతి గణనీయంగా తగ్గిపోయింది. గంటల తరబడి నిరీక్షించినా, కాకులు వచ్చి పిండాలను ముట్టుకోవడం లేదు. అదే కరావళి ప్రాంతంలోని ప్రశాంత్ పూజారి అనే యువకుడిలో కొత్త ఆలోచన రేకెత్తేలా చేసింది. ఓ కాకిని పెంచుకోవడం ప్రారంభించి, ఎక్కడైనా సమారాధనలు జరిగితే కాకి దొరుకుతుందని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. ఒక్కసారిగా అతని తలరాత మారిపోయింది. కాకికి డిమాండ్ పెరిగి, ముందస్తు బుకింగ్ లు కూడా వస్తున్నాయి.

Related posts