karnataka-assembly-updates

హడావిడిగా…ప్రమాణస్వీకారాలు…

99

కర్ణాటక విధాన సభ మొదలైంది. ప్రొటెం స్పీకర్ బోపయ్య కొత్త వారితో ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. అటు బీజేపీ సభ్యులు కొందరు నిదానంగా హాజరవుతున్నారు. ఇటు కాంగ్రెస్ నుండి జేడీఎస్ నుండి సభ్యులు కూడా హాజరయ్యారు. ముందుగా బోపయ్య యడ్యూరప్ప, సిద్దరామయ్య చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అటుపిమ్మట మిగిలిన ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు.

karnataka-assembly-updates

ఒక్కొక్కరిగా ప్రమాణస్వీకారం చేయిస్తే సాయంత్రం బలపరీక్ష సమయానికి కూడా ఈ కార్యక్రమం పూర్తి కాదని బోపయ్య ఒక్కసారే ఇద్దరు లేదా ముగ్గురితో ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. కాగా కాంగ్రెస్ శ్రేణుల నుండి అనంత్ సింగ్, ప్రతాప్ గౌడ్ లు ఇంకా సభకు హాజరు కాకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు ఇద్దరు ఎమ్మెల్యేలు తాజ్ వెస్టన్ట్ హోటల్ లో ఉన్నామని భావించాం కానీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు బెంగళూరు లోని రేస్ కోర్స్ రోడ్ లో వున్న గోల్డ్ ఫించ్ హోటల్ లో ప్రస్తుతం ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు తలదాచుకున్నట్లు సమాచారం. ఇ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు అక్కడకు చేరుకొని మంతనాలు జరుపుతున్నారు.

ఎంపీ పదవులకు రాజీనామా చేసిన యడ్యూరప్ప మరియు శ్రీరాములు.. రాజీనామాను ఆమోదించిన లోక్ సభస్పీకర్.

ఎమ్మెల్యేలకు బీజేపీ విప్ జారీచేసింది. ప్రస్తుతం సభలో కాంగ్రెస్ 77, జేడీఎస్ 37 మంది హాజరయ్యారు. బీజేపీ నుండి కూడా ఒక ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి సభకు హాజరు కావాల్సి ఉందని సమాచారం.

మధ్యాహ్న విరామం కూడా ఇవ్వకుండానే ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం సాయంత్రం 4 గంటలకల్లా పూర్తి చేయాలని ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు.

అయితే ఈ బలపరీక్ష ను అన్ని జాతీయ, అంతర్జాతీయ మీడియాలలో లైవ్ టెలికాస్ట్ చేయాలని సుప్రీం ఆదేశించిన విషయం తెలిసిందే.