telugu navyamedia
సినిమా వార్తలు

అర్జున్ కపూర్ హీరోగా ‘భీష్మ’ హిందీ రీమేక్…

Arjun-Kapoor

‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ లో ‘కబీర్ సింగ్’ గా సంచలన విజయాన్ని నమోదు చేయడంతో, తెలుగు సినిమాలను హిందీలోకి రీమేక్ చేసే వేగం పెరిగింది. ‘ఆర్ ఎక్స్ 100’ .. ‘ఓ బేబీ’ సినిమాలు అక్కడ రీమేక్ గా రూపొందనున్నాయి. ఈ జాబితాలో ‘భీష్మ’ సినిమా కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ‘భీష్మ’ ఇక్కడ పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాను రణబీర్ కపూర్ హీరోగా హిందీలో నిర్మించడానికి కరణ్ జొహార్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే రణబీర్ కపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో, అర్జున్ కపూర్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

Related posts