telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టీవీ సీరియల్స్ షూటింగ్‌ లకు కర్నాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Karnataka

కరోనా మహమ్మారి అన్ని రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగులతో పాటు సీరియల్స్ చిత్రీకరణలు కూడా నిలిచిపోయాయి. దీంతో సీరియల్స్ ప్రసారాలను ఆపివేశాయి టీవీ ఛానెల్‌లు. తాజాగా టీవీ సీరియల్స్ షూటింగ్‌లకు అనుమతిస్తూ కర్నాటక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్నింటికి సడలింపులు ఇస్తూ లాక్‌డౌన్ ఆంక్షలు ఇచ్చింది. దీంతో కన్నడ టెలివిజన్ సంఘం అధ్యక్షుడు శివకుమార్ సీఎం యాడియూరప్పను కలిసి.. షూటింగులకు అనుమతి ఇవ్వాలని కోరారు. లాక్‌డౌన్ కారణంగా సినీ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారి జీవనంపై ప్రభావం పడిందని సీఎంకు పరిస్థితులను వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కర్నాటక సీఎం యడియూరప్ప కొన్ని రూల్స్‌తో మినహాయింపులు ఇస్తూ టీవీ షూటింగులకు అనుమతిచ్చారు.

టీవీ సీరియల్స్ షూటింగ్‌ లకు రూల్స్ :
1. షూటింగ్ సమయంలో మాస్కులు, శానిటైజర్లు విరివిగా వాడాలి.
2. తక్కువ మంది నటీనటులతో టీవీ సీరియల్స్ చిత్రీకరణ చేయాలి.
3. ఎక్కువ మంది ఒకేచోట గుమికూడదన్నారు
4. షూటింగ్‌లో 12 మంది మాత్రమే ఉండాలి
5. బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్‌లకు అనుమతి లేదు
6. కరోనా కేసులు లేని ప్రాంతాల్లో మాత్రమే సీరియల్స్ షూటింగులు చేయాలి

Related posts