puneeth-raj-kumar

కన్నడ నటుడు పునీత్ కు తప్పిన ప్రమాదం…

23

కంఠీరావ స్టూడియోస్ నిర్మాత, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ తనయుడు, యువ నటుడు పునీత్ రాజ్‌కుమార్ అర్ధరాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వివరాల ప్రకారం బళ్లారిలో జరుగుతున్న ‘నట సార్వభౌమ’ సినిమా షూటింగ్ అనంతరం బెంగుళూరు వస్తున్న పునీత్, తన రేంజ్ రోవర్ కారులో బెంగళూరు బయలుదేరాడు, మార్గమధ్యలో అనంతపురం సమీపాన ఒక్కసారిగా కారు టైరు పంచర్ అవడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది, అదృష్టం కొద్ది ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో కారులో ఉన్న డ్రైవర్ తో సహా పునీత్ ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదం జరిగిన విషయాన్నీ పునీత్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా నిర్దారించారు. అభిమానులు ఆందోళనకు గురికావద్దని, ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డానని న్యూస్ ఛానెళ్లలో మరియు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని సురక్షితంగా ఉన్నానని తెలియడానికి ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపాడు, ప్రస్తుతం యువనటుడు పునీత్ రాజ్‌కుమార్ ‘నట సార్వభౌమ’ చిత్రంలో నటిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించి సమీప ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు.

ఈ మధ్య సినీ సెలెబ్రెటీలకు వరుస ప్రమాదాలు సంభవించడంతో అభిమానులు ఆందోళనలు వ్యక్తపరుస్తున్నారు. ఈ మధ్య తెలుగు చలనచిత్ర నటుడు నవీన్ బాబు ఘంట (నాని) షూటింగ్ అనంతరం, డ్రైవర్ నిద్రిస్తూ కారు నడపడంతో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక ఎలక్ట్రిక్ స్థంబానికి గుద్దడంతో చిన్న గాయాలతో బయటపడ్డాడు.