BREAKING NEWS:
kannada star hero duniya vijay

కన్నడ బ్లాక్ కోబ్రా అరెస్ట్…

82

సాండిల్ ఉడ్ మాస్తిగుడి చలన చిత్రం క్లైమాక్స్ భాగాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో విలన్లుగా నటిస్తున్న ఇద్దరు జలసమాధి అయిన కేసులో ప్రముఖ కన్నడ హీరో, బ్లాక్ కోబ్రాగా గా పిలువబడే దునియా విజయ్ ని అచ్చుకట్టు పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం సాండిల్ ఉడ్ మాస్తిగుడి సినిమాని బెంగుళూరు నగర శివారులో చిత్రీకరిస్తున్నారు. అదే సమయంలో హెలికాఫ్టర్ లోనుంచి తిప్ప గుండన హళ్లి చెరువులో అదుపుతపప్పి పడిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నటులు ఉదయ్, అనీల్ (విలన్ లు) చెరువులో పడి జలసమాధి అయ్యారని కేసు నమోదు చేశారు.

top-fighters-uday-anil-died
దర్యాప్తు జరిపిన పోలీసులు నిర్మాత సుందర్ పి గౌడ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని చెన్నమ్మనకెరేఅచ్చుకట్టు పోలీసులు తెలిపారు. నిర్మాత సుందర్ ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారని తెలిసి పరారయ్యాడు. అతను తప్పించుకోవడానికి హీరో విజయ్ సహకరించాడని ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన పోలీసులు బ్లాక్ కోబ్రాని అరెస్ట్ చేయడానికి నాలుగురోజుల క్రితం వెళ్లగా తప్పించుకొని ఒక రిసార్టులో తలదాచుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు రిసార్టును గుర్తించి ఈరోజు విజయ్ ని అరెస్ట్ చేశారు. తమ అభిమాన హీరోను అరెస్ట్ చేశారని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం అందుకున్న పోలీసులు విజయ్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు.

sunder-and-vijay