telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కన్నడ హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం

Chiranjeevi-Sarja

కన్నడ యువ హీరో చిరంజీవి సర్జా ఆదివారం కన్నుమూశారు. ఆయన వయసు 39 సంవత్సరాలు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడిన ఆయన్ని కుటుంబసభ్యులు శనివారం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు తుదిశ్వాస విడిచారు. సీనియర్‌ హీరో అర్జున్‌కు మేనల్లుడాయన. కథానాయిక మేఘనారాజ్‌తో పదేళ్లు ప్రేమాయణం సాగించిన చిరంజీవి సర్జా 2018లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆయన సోదరుడు ధృవ్‌సర్జా కన్నడలో హీరోగా కొనసాగుతున్నారు. చిరంజీవి సర్జా హఠాన్మరణంతో కన్నడ చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రియమణి, ఖుష్బూతో పాటు పలువురు దక్షిణాది నటీనటులు సంతాపాన్ని తెలియజేశారు. అర్జున్‌ దగ్గర నాలుగు సంవత్సరాలు సహాయదర్శకుడిగా పనిచేసిన చిరంజీవి ‘వాయుపుత్ర’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. తొలి సినిమాతోనే మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నారు. కన్నడంలో 19 సినిమాల్లో హీరోగా నటించారు చిరంజీవి సర్జా. చంద్రలేఖ, విజిల్‌, రుద్రతాండవ, రామ్‌లీలా, అమ్మ ఐ లవ్‌ యూతో పాటు పలు చిత్రాలు హీరోగా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. చిరంజీవి సర్జా హీరోగా నటించిన చివరి చిత్రం ‘శివార్జున’ మార్చిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Related posts