kanna letter about ap demands to modi

ప్రధానికి జలక్ ఇచ్చిన కన్నా లక్ష్మీ నారాయణ…

27

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఇన్నాళ్ళు బీజేపీ నేతలు బుకాయిస్తున్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 85 శాతం విభజన హామీలు నెరవేర్చామని చెప్పింది అంతా అబద్ధమే అని లేఖలో ఇంకా 12 విభజన హామీలను ఇంకా నెరవేర్చలేదని పేర్కొన్నారు.

వివరాల ప్రకారం చంద్రబాబు గత నాలుగు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు, ఏదైతే హామీల కోసం పోరాడుతున్నాడో ఆ హామీలు నెరవేర్చలేదని స్వయంగా ప్రధానమంత్రికి లేఖ రాసాడు. ఆ లేఖలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 85శాతం విభజన హామీలను నెరవేర్చమన్నది అంత అబద్దమే, ఆంధ్రుల పోరాటాన్ని ఇన్నాళ్లు అవహేళన చేస్తున్న బీజేపీ నాయకులకు, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ రాసిన లేఖతో నోట్లో మాటలు రావడంలేదు.

letter-about-ap-demands

నరేంద్ర మోడీని కలిసిన కన్నా లక్ష్మీ నారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై చర్చినట్టు బయటకు చెప్పారు. కాని లోపల ఏమి జరిగిందో, మన ఊహించుకోవచ్చు. బయటకు వచ్చిన లక్ష్మీ నారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడుతున్నామని, రాష్ట్ర పురోగతిలో చంద్రబాబు పాత్ర శూన్యమని, అసలు బీజేపీ లేకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే లేదు అన్నట్టు చెప్పుకొచ్చారు. ఇప్పటికే నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సకల సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చాడని, ఇంకా చెయ్యాల్సినవి కొన్ని ఉన్నాయని, ఆ చెయ్యాల్సిన లిస్టు, ప్రధాని మోడీకి ఇచ్చినట్టు, కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు.

కన్నా ఇచ్చిన లేఖను మీడియాలో పెట్టగా, సరిగ్గా ఇక్కడే బురదలో కాలు వేసినట్లైంది బీజేపీకి, ఆ లేఖలో ఇంకా 12 అంశాలకు సంబంధించి ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నెరవేర్చేవి ఉన్నాయని ఈ లిస్టులో వున్నా పన్నెండు అంశాలను పార్లమెంట్ సాక్షిగా మన రాష్ట్రానికి రావాల్సినవని ఇంకెప్పుడిస్తారు అన్నట్లుగా లేఖ ఉంది. అయితే ఈ లేఖ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగేళ్లుగా కేంద్ర మోసం చేస్తుందని అనుకోవాలో లేక ఇంకెప్పుడిస్తారన్నట్లుగా ప్రశ్నిస్తూ, ఉనట్లుంద అని బీజేపీ నేతల్లో అలజడి చెలరేగింది. మరోపక్క అన్ని ఇచ్చాము విభజన హామీలను మొత్తం నెరవేర్చామని, రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలను మోసం చేస్తుందని బీజేపీ నేతలు జీవీయెల్ నరసింహారావు, పురంద్రేశ్వరిగారు, విష్ణువర్ధన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతుంటే ఏమనాలి ?

మొత్తానికి ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం నెరవేర్చలేదని సొంత పార్టీ అధ్యక్షుడే తిరగబడే స్థాయికి చేరుకున్నట్లుగా భావిస్తున్నారు ప్రజలు. కేంద్రం చేసిన మోసానికి వచ్చే ఎన్నికల్లో గెలుపు అసాధ్యమని చర్చిస్తున్నారు.