kanna fire on ap cm

చంద్రబాబుపై కన్నా ఘాటు విమర్శలు

16
చంద్రబాబు ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఘాటు విమర్శలు చేశారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ రాకపోవడానికి తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని యన  ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వానికి సిగ్గు, లజ్జా లేవని, నిర్లజ్జగా అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. మోసపూరిత చర్యలతో ప్రజల ముందు బీజేపీని దోషులుగా నిలబెట్టాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణ త్యాగం చేస్తామన్న టీడీపీ నేతలు నాటకాలు ఆపాలంటూ హితవు పలికారు. ప్రజలను మోసం చేయడం ఆపి, ఇప్పుడైన నిజాలు చెప్పాలంటూ దుయ్యబట్టారు. 
 
జిల్లాలో స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని జూన్ లో రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పట్టుబట్టడంతో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ మరోసారి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, మెకాన్ సంస్థలు కలసి నివేదిక అందజేస్తే… త్వరలోనే ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలలో ప్లాంట్ సాధ్యపడదు అని ఎక్కడా లేదని తెలిపారు. పునర్విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.