న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టీమిండియా బౌలర్ నటరాజన్‌పై ప్రశంసలు కురిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో తనతో కలిసి ఆడటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. కేన్ విలియమ్సన్ నటరాజన్ గురించి మాట్లాడుతూ ‘‘నటరాజన్ అద్భుతమైన వ్యక్తి. ఐపీఎల్ టోర్నమెంట్‌లో గొప్పగా రాణించాడు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. వాస్తవానికి తను నెట్‌బౌలర్‌గా ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అయితే వారవారానికి తనకున్న అవకాశాలు ఎంతో మెరుగుపడ్డాయి. గబ్బా టెస్టులో టీమిండియా చిరస్మరణీయ విజయంలో తన పాత్ర కూడా ఉండటం నిజంగా సంతోషకరం. ఇంతటి ప్రతిభ ఉన్న వ్యక్తి నాకు సహచర ఆటగాడు కావడం పట్ల గర్వంగా ఉంది’’ అని అన్నాడు. కాగా ఆసీస్ టూర్‌లో భాగంగా మూడో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన తమిళనాడు సీమర్ నట్టు.. ఆ తర్వాత టీ20, సంప్రదాయ క్రికెట్‌లో కూడా అడుగుపెట్టాడు. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 11 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో అనేక కష్టనష్టాలకోర్చి క్రికెటర్‌గా తనను నిరూపించుకున్న నటరాజన్‌పై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. ఈ క్రమంలో విలియమ్సన్ మాట్లాడుతూ.. ‘‘తను చాలా నిరాడంబరంగా ఉంటాడు. అద్భుతమైన ప్రతిభ కలవాడు. టీమిండియాకు దొరికిన మంచి ఆటగాడు. అతి తక్కువ సమయంలోనే, యువ క్రికెటర్ నుంచి పరిణతి కలిగిన ఆటగాడిగా రూపాంతరం చెందాడు. నాతో కలిసి ఆడిన నటరాజన్, ఆసీస్ టూర్‌లో సాధించిన విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉంది’’ అని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2020 సీజన్‌లో సన్‌రైజర్స్ తరఫున ఆడిన నటరాజన్, 16 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ పర్యటనకు నెట్‌బౌలర్‌గా ఎంపికయ్యాడు. ఇక కేన్ విలియమ్సన్ సైతం ఐపీఎల్‌లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
previous post
next post
కేసీఆర్ దొరతనాన్ని ప్రదర్శించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం: విజయశాంతి